Header Banner

అమరావతి రైల్వేలైన్‌కు 22 గ్రామాల్లో భూసేకరణ! వివరాలు ఇవే!

  Sat May 03, 2025 12:23        Politics

ఏపీ కలల రాజధాని అమరావతి మీదుగా నిర్మిస్తున్న రైల్వే లైన్‌కు (ఎర్రుపాలెం నుంచి నంబూరు) సంబంధించి భూసేకరణ ప్రక్రియ శరవేగంగా చేయనున్నారు. ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో పెగ్‌ మార్కింగ్‌ (రైల్వే లైన్‌ వెంబడి వేసే మార్కింగ్‌)ను అధికారులు పూర్తిచేశారు. తొలుత ఎన్టీఆర్‌ జిల్లా పరిధితోపాటు తెలంగాణలోని ఎర్రుపాలెం మండల పరిధిలో భూసేకరణ పూర్తిచేయనున్నారు. అనంతరం ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు 27 కిలో మీటర్ల మేర మొదటి దశ పనులు చేపట్టనున్నారు. మొత్తం 56.53 కిలో మీటర్ల మేర ఉన్న ఈ రైల్వే లైన్‌ కోసం 8 మండలాల్లోని 22 గ్రామాల్లో భూమిని సేకరిస్తున్నారు.

ఈ జిల్లాల్లో ఎక్కువ భూములు సేకరణ: తెలంగాణలోని ఖమ్మం పరిధి ఎర్రుపాలెం మండలంలో 24.24 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లాలో 334.62 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 333.95 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 199.43 ఎకరాల భూములను సేకరిస్తున్నారు.

అమరావతి రైల్వేలైన్‌ ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో ప్రైవేటు భూములు 741.8 ఎకరాలు, ప్రభుత్వ భూములు 98.2 ఎకరాలు, ఇనాం భూములు 52.01 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏయే మండలాల్లో భూసేకరణ కొలిక్కి వస్తే, వాటికి సంబంధించి డబ్బులను రైల్వేశాఖ త్వరలోనే డిపాజిట్‌ చేయనుంది.

అమరావతి, తుళ్లూరు, తాడికొండ, పెదకాకాని మండలాల్లోని కొన్ని గ్రామాల్లో రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో ఇంకా పెగ్‌ మార్కింగ్‌ జరగలేదు. రెవెన్యూ అధికారుల చర్చలు కొలిక్కి వచ్చిన తరువాత అక్కడ కూడా పెగ్‌ మార్కింగ్‌ పూర్తి చేయనున్నారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుకు కేంద్రం 2,047 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.

రైల్వే లైన్‌ వెళ్లే మండలాలు - అందులోని గ్రామాలు:

తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలోని కేసిరెడ్డిపల్లి, ఎర్రుపాలెం
ఆంధ్రప్రదేశ్​లోని ఎన్టీఆర్‌ జిల్లా వీరులపాడు మండలంలోని గూడెం మాధవరం, పెద్దాపురం, అల్లూరు, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం.
కంచికచర్ల మండలంలోని పరిటాల, గొట్టుముక్కల.

ఇబ్రహీంపట్నం మండలంలోని దాములూరు, చిలుకూరు.
పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో ఎండ్రాయి, కర్లపూడి, వైకుంఠపురం.
తుళ్లూరు మండలంలోని మోతడక, వడ్డమాను.
తాడికొండ మండలంలోని తాడికొండ, కంతేరు, పెదపరిమి.
పెదకాకాని మండలంలోని పెదకాకాని, కొప్పురావూరు.

ఇది కూడా చదవండిపలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #amaravatirailway #landacquisition #railwayproject #infraupdate #railconnect #andhragrowth